Rajakiyam

2019-01-10 11:29:55

ప్రతిపక్ష నేత జగన్ చేసేది విరామ యాత్ర : సీఎం చంద్రబాబు

ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టును కొందరు స్వార్ధ రాజకీయ నేతలు అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే రామాయపట్నం పోర్టుతో ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కాంక్ష నెరవేరుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.కాగా అతిత్వరలోనే జిల్లాలో కాగితపు పరిశ్రమ తీసుకుని వస్తామనీ,దీని వలన 50,000 మంది రైతులు లబ్ధి చేకూరుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అయితే నిన్న ప్రకాశం జిల్లాలో ఈరోజు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ….రామాయపట్నం ఓడరేవు నిర్మాణం పూర్తయ్యేసరికి కాగితపు పరిశ్రమ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.ఏపీ  అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు సహకరించడం లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు.

ఈ నేపథ్యంలోనే జగన్ ప్రజాసంకల్ప యాత్ర పై కూడా చంద్రబాబు స్పందించారు.నేను పవిత్ర పాదయాత్ర చేస్తే.. జగన్ విరామ పాదయాత్ర చేశారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.కోడి కత్తి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ కు అప్పగించడం అంటే దొడ్డిదారిన ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం పెత్తనం చేయడమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మను తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు చెప్పడం ప్రధాని నరేంద్ర మోదీకి చెంపదెబ్బని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.