Rajakiyam

2019-01-09 03:03:31

ప్రతిపక్ష నేత జగన్ పై సీఎం చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు..!

ఈరోజు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు సభ్యత్వ నమోదులో ముందంజలో ఉన్నాయని, విశాఖ రూరల్, కడప, శ్రీకాకుళంలో ముమ్మరం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.అవినీతిలో నిండా కూరుకుపోయిన వ్యక్తులే  అవినీతిపై పుస్తకాలు వేస్తున్నారని జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి చక్రవర్తని ఆయన వల్ల ఎంతో మంది జైలుకు వెళ్లారని.. అవమానాలకు గురయ్యారన్నారు.బాబు బాట - బంగారు బాట, జగన్ బాట - జైలు బాట అని ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై జగన్ నోరెందుకు మెదపరని ప్రశ్నించారు.