Headlines

2018-11-08 10:22:26

కియా ప్లాంటు నిర్మాణం పూర్తయింది: సీఎం చంద్రబాబు వీడియో విడుదల

నవ్యాంధ్రలో రెండేళ్ల క్రితం పరిశ్రమను స్థాపించి, కార్లను తయారు చేసేందుకు ముందుకు వచ్చిన 'కియా' ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అనంతపురం జిల్లాలో ఈ ప్లాంటును నెలకొల్పగా, కియా ప్లాంటు నిర్మాణం పూర్తయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. "ఇన్నోవేటివ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌ లో తమ ఉత్పత్తులను ప్రారంభించడానికి సిద్ధమైన కియా మోటార్స్ కంపెనీ.." అని క్యాప్షన్ పెట్టారు. సీఎం చంద్రబాబు పోస్టు చేసిన వీడియోను మీరూ తిలకించండి.