blog single post
Headlines

2018-11-07 09:07:58

స్పీడు పెంచిన సీఎం చంద్రబాబు.. కుమారస్వామి, స్టాలిన్ తో కీలక చర్చలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేక కూటమిని కూడగట్టడంలో తొలి దశలో విజయం సాధించిన సీఎం చంద్రబాబు జోరు పెంచారు. ఈ నెల 20 తర్వాత చెన్నై వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. అయితే, సీఎం చంద్రబాబు కచ్చితంగా చెన్నై ఎప్పుడు వెళ్లేది వచ్చే వారం ఖరారు కానుంది. వీరిద్దరితో భేటీ అనంతరం జనవరిలో ఢిల్లీలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో కూటమి రూపు రేఖలపై చర్చిస్తారు. నిజానికి ఈ సమావేశాన్ని వచ్చే నెలలోనే నిర్వహించాలని ముందుగా భావించారు. అయితే, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల జరగనుండడంతో నేతలు తీరిక లేకుండా ఉన్నారు. దీంతో ఈ సమావేశాన్ని జనవరికి వాయిదా వేశారు.
రేపు  క‌ర్ణాట‌క సిఎం కుమార‌స్వామిల‌తో భేటీ 
బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌ను ఏకం చేసే ఆలోచ‌న‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రేపు మ‌ధ్యాహ్నం బెంగ‌ళూరు వెళ్ల‌నున్నారు. అక్క‌డ మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌, క‌ర్ణాట‌క సిఎం కుమార‌స్వామిల‌తో భేటీ అవుతారు. ప్రధాని మోదీని ఎలాగైనా గ‌ద్దె దించాల‌న్న సంక‌ల్పంతో సీఎం చంద్ర‌బాబు ఈ ప‌ర్య‌ట‌న చేస్తుండ‌గా..ఇదే వారంలో బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని కూడా క‌ల‌వ‌నున్నారు.