blog single post
Headlines

2018-11-05 07:34:38

సినీరంగంలో అసంతృప్తితోనే.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చా!..పవన్

స‌మాజాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌నేది త‌న ఆశ‌య‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కాకినాడ‌లో ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంలో ప‌వ‌న్ మాట్లాడుతూ..నాయ‌కుల‌ను కులాల‌వారీగా కాకుండా వ్య‌క్తిగ‌తం చూసి ఎన్నుకోవాల‌న్నారు. సినీ రంగంలో 15 ఏళ్లు అసంతృప్తితో ప‌నిచేసి, రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని తెలిపారు. స‌మస్య ఎక్క‌డుంటే అక్క‌డికి వెళ్లే హ‌క్కు త‌న‌కుంద‌న్నారు. విద్య, వైద్యం ఉచితంగా ప్ర‌జ‌ల‌కు క‌ల్పించాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.