blog single post
Headlines

2018-11-05 11:12:19

ఏపీ పోలీసుల వినియోగించలా?లేదా?....నేడు నిర్ణయం

వచ్చే నెలలో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులను వినియోగించాలా?..వద్దా? అనే విషయమై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ పోలీసులు వద్దంటూ రాష్ట్ర సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం పోలీసులను పంపడానికి సిద్ధంగా ఉండాలని ఏపీ డీజీపీకి సూచించింది. ఈనేపధ్యంలో బందోబస్తు చర్యలపై ఎన్నికల కమిషన్‌ ఈరోజు కీలక విడియో కాన్ఫరెన్స్‌ జరపనుంది. ఈ కాన్ఫరెన్స్‌లో తమిళనాడు, కేరళ, కర్నాటక,ఛత్తీస్‌గడ్‌ అధికారులతో పాటు ఏపీ డీజీపీ, సీఎస్ కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే ఏపీ పోలీసుల వినియోగంపై ఈసీ తుది ఆదేశాలు జారీ చేయవచ్చని భావిస్తున్నారు.