blog single post
Headlines

2018-11-03 08:23:16

త్వరలోనే ఏపీకి పట్టిన చంద్రగ్రహణం తొలగిపోతుంది: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నవరంలో డ్వాక్రా మహిళలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ….ఆడపడుచులకు అండగా ఉంటానని...అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పార్టీలకతీతంగా అందరికీ అండగా ఉంటామన్నారు. మహిళల, ఆడపడుచుల, అక్కచెల్లెళ్ల సమస్యలు ప్రత్యక్షంగా చూసినవాణ్ణి అని, వారికి అన్నివిధాలుగా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. కనీసం చట్ట సభల్లో మూడవ వంతు మహిళలకి రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండాలన్నారు.  త్వరలోనే డ్వాక్రా మహిళలకు శిక్షణా సదస్సు నిర్వహిస్తామన్నారు. అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరని, త్వరలోనే రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం తొలగిపోతుందని పవన్ కల్యాణ్ అన్నారు.