blog single post
Headlines

2019-04-15 02:44:21

అందరూ కదలివచ్చి దుష్టశక్తుల కుట్రలు తిప్పికొట్టారు:సీఎం చంద్రబాబు

టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ లో మాట్లాడుతూ … ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని వ్యాఖ్యానించారు.ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ  విజయాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేశారని విమర్శించారు.రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు నుండే దాడులు చేశారని ఆరోపించారు.ఏపీ ప్రజలకు తెలుగుదేశం పార్టీని దూరం చేయాలని చూశారని, వైసీపీ అరాచకాలు, బీజేపీ తప్పుడు పనుల్ని ఎండగట్టామని  ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.కాగా తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించగా,ఆంధ్రప్రదేశ్ లో 8 లక్షల ఓట్లను తొలగించారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.కొంతమంది ఓటర్లను పోలింగ్‌కు రాకుండా భయపెట్టారని, అందరూ కదలివచ్చి దుష్టశక్తుల కుట్రలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు.కాగా వెనక్కి వెళ్లిన వాళ్లు కూడా తిరిగివచ్చి మరి ఓట్లు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.