blog single post
Headlines

2019-04-15 01:11:33

ముగిసిన ఏషినెన్స్‌-19 నేవీ విన్యాసాలు

ఆస్ట్రేలియా-భారత నేవీ విన్యాసాలు విశాఖ తీరంలో నిన్న ముగిశాయి.కాగా ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఆస్ట్రేలియా-భారత నావికాదళాలు సంయుక్తంగా ఈ నెల 2వ తేదీన ఈ విన్యాసాలు చేపట్టాయి.అయితే ఏషినెన్స్‌-19 పేరిట నిర్వహించిన ఈ నేవీ విన్యాసాల్లో ఆస్ట్రేలియాకు చెందిన కాన్‌బెర్రా, పరమట్టా,న్యూకేజల్‌,  సక్సెస్‌ నౌకలతో పాటుగా హెలికాప్టర్లు, సబ్‌మెరైన్‌,యాంటీ సబ్‌మెరైన్‌ ఎయిర్‌ క్రాప్ట్ లు పాల్గొన్నాయి.అలానే ఆస్ట్రేలియా నేవీతో పాటు 50 మంది అమెరికా, 20 మంది న్యూజిలాండ్‌ నేవీ సిబ్బంది కూడా ఈ సంయుక్త విన్యాసాలలో పాల్గొన్నారు.ఈ విన్యాసాలు ముగింపు సందర్భంగా ఆస్ట్రేలియా నావికాదళ అధికారికి,తూర్పు నావికాదళ ఉన్నతాధికారి జ్ఞాపికను అందజేశారు.