blog single post
Headlines

2019-04-13 10:51:43

విడుదలైన ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్  ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో చదువుల తల్లులు మరోసారి తమ సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత నెలలో నిర్వహించిన మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్‌ పరీక్షల్లో బాలికలు రికార్డు స్థాయిలో ఉత్తీర్ణులయ్యారు.అయితే బాలుర విషయానికి వస్తే మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్‌ పరీక్షల్లో బాగా వెనుకబడ్డారు.కాగా బాలికలు 75% పైగా ఉత్తీర్ణత సాధించగా .. బాలురు 68% ఉత్తీర్ణత సాధించారు.మొదటిసారిగా గ్రేడింగ్‌ విధానం అనుసరించిన ఈ రెండు పరీక్షల ఫలితాలను నిన్న ఇంటర్‌ బోర్డు సెక్రటరీ బి. ఉదయలక్ష్మి సచివాలయంలో విడుదల చేశారు. కాగా ద్వితీయ సంవత్సరంతో పోలిస్తే మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత బాగా తగ్గింది. అటు మొదటి, ఇటు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవగా, కడప జిల్లా చివరి స్థానంలో  నిలిచింది.