blog single post
Headlines

2019-04-12 03:59:25

భయానక వాతావరణం సృష్టించారు:టీడీపీ అధినేత చంద్రబాబు

ఈ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్‌, కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాది జగన్‌తో పోరాడాల్సి వచ్చిందని తెలుగు దేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వారికున్న అధికారాలన్నీ నీచంగా ఉపయోగించారని మండిపడ్డారు. వీరందరూ రాష్ట్రాన్ని అణగదొక్కడానికి సంకల్పించారని విమర్శించారు.ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఉదయం 31 శాతం ఈవీఎంలు పని చేయకపోవడంతో పాటు ఒకరకమైన భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. ఒకే రోజు ఈవీఎంలు పలుసార్లు మొరాయించడంతో ప్రజలు పలుసార్లు  పోలింగ్ కేంద్రాలకు తిరిగారని చెప్పారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఎండలను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.