blog single post
Headlines

2019-04-12 11:38:05

విడుదలైన ఇంటర్‌ ఫలితాలు!

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మొదటిసారిగా  ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలో వెల్లడించారు. ఇంటర్‌ రెండు సంవత్సరాల ఫలితాల్లో బాలికదే పైచేయి కావడం గమనార్హం. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 60 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరంలో 81 శాతం, రెండో సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది.అయితే  9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఉదయలక్ష్మి తెలిపారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణలు కాగా.. 3.3 లక్షల మంది ఉత్తీర్ణత  సాధించలేదు. మే 14 నుండి  అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.