blog single post
Headlines

2019-04-12 11:06:30

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు:వైఎస్ జగన్

ఆ భగవంతుని దయ ఉందని తప్పకుండా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ధీమా వ్యక్తం చేశారు.కడప జిల్లా పులివెందులలోని 134వ పోలింగ్‌ కేంద్రంలో నిన్న  ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని.. తప్పకుండా తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. జగన్‌ సతీమణి భారతీరెడ్డి, తల్లి విజయమ్మ ఓటు హక్కును వినియోగించుకున్నారు.