blog single post
Headlines

2019-04-10 12:09:49

ఏపీ రాజధానిలో ఇస్లామిక్ బ్యాంకు!

ఇస్లామిక్‌ బ్యాంకును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయిస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించడం హర్షణీయం. ఇలాంటి ఆలోచన చేయడం ఎంతో ప్రయోజనకరం. రాష్ట్రంలోని పేదలందరికీ, ముఖ్యంగా ముస్లింలకు సులభంగా పెట్టుబడులు సమకూర్చడానికి టీడీపీ ప్రభుత్వం దారిచూపుతోంది. ముస్లింలంతా దీనిని అర్థం చేసుకుని మద్దతివ్వాలి’ అని ఇస్లామిక్‌ ఫైనాన్స్‌ భారత కేంద్రం  ప్రధాన కార్యదర్శి, ఇస్లామిక్‌ బ్యాంకు జాతీయ కమిటీ కన్వీనర్‌ హెచ్‌.అబ్దుర్‌ రఖీబ్‌ చెప్పారు. ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటుచేస్తే కలిగే ప్రయోజనాలపై ఇటీవల తాను చంద్రబాబును కలసి వివరించగానే స్పందించి టీడీపీ మేనిఫెస్టోలో దీనిపై హామీనివ్వడం ముస్లింలందరు హర్షం వ్యక్తం చేశారు.