blog single post
Headlines

2019-04-09 04:33:29

సీఎం పదవి కోసం జగన్ హైదరాబాద్‌లో కూర్చొని కుట్రలు:టీడీపీ అధినేత చంద్రబాబు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ లో జాబు రావాలంటే మళ్లీ మళ్లీ బాబు రావాలి, బాబే ఉండాలని స్పష్టంచేశారు. బీసీల కోసం ఆదరణ పథకం తీసుకొచ్చామని, పది వేలకోట్లతో బీసీలకు బ్యాంకు పెడుతున్నామని ప్రకటించారు. ప్రతి వారం కోర్టుకెళ్లే వ్యక్తిని చూసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు.సీఎం పదవి కోసం జగన్ హైదరాబాద్‌లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. జగన్ సీఎం అయితే రాజధాని, పోలవరం ఆగిపోతుందని, సాగర్, శ్రీశైలం కేసీఆర్ చేతుల్లోకి వెళిపోతాయని తెలిపారు. జగన్‌కు సీఎం పదవి బాంచన్ అని అనడానికా? లేక మోడీకి ఊడిగం చేయడానికా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బులు గెలిపించలేవని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు ఇచ్చే డబ్బులు అవసరమా? అని అడిగారు. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీనే గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.