blog single post
Headlines

2019-03-15 12:08:24

సుదీర్ఘ కసరత్తు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేశాం:సీఎం చంద్రబాబు

భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.టీడీపీ నేతలతో  టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ … అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ప్రకటించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు.అయితే సుదీర్ఘ కసరత్తు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేశామని తెలిపారు.కాగా కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకే రాగ ద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని వివరించారు.అయితే టికెట్‌ రాని వారెవ్వరూ నిరాశ చెందొద్దని,అందరి సేవలూ గుర్తించి పార్టీ తగిన విధంగా గుర్తింపు ఇస్తుందని భరోసా ఇచ్చారు. రాబోవు రోజుల్లో తగిన ప్రాధాన్యత  అందరికీ కల్పించే బాధ్యత నాదేదని స్పష్టం చేశారు.

పార్టీ ప్రకటించిన అభ్యర్థులందరినీ కార్యకర్తలు ఆశీర్వదించాలని అధినేత చంద్రబాబు కార్యకర్తలకు కోరారు.కాగా పార్టీ కార్యకర్తలను కలుసుకోకుండా వెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని నేతలను సీఎం హెచ్చరించారు.కుల, మత, ప్రాంతాలకతీతంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో పాటు, ఎవరూ చేయలేని అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు.37 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో 22 ఏళ్లు అధికారంలో ఉన్నామని సీఎం  గుర్తుచేశారు.అధికారానికి దూరంగా ఉన్న 10 ఏళ్లు రాష్ట్రంలో జరిగిన అరాచకం అందరికీ తెలిసిందేనని అన్నారు.కాగా ఓటు మార్పు చేసి మళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని సీఎం చంద్రబాబు అన్నారు.