blog single post
Headlines

2019-03-15 10:37:26

వైఎస్‌ వివేకానందరెడ్డి అకాల మరణం!

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, జగన్‌  బాబాయి అయినటువంటి వైఎస్‌ వివేకానందరెడ్డి (68) హఠాన్మరణం చెందారు. పులివెందులలోని ఆయన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. మృతదేహాన్ని పోస్ట్  మార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు . ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి  రెండుసార్లు (1999, 2004) ఎన్నికయ్యారు. పులివెందుల నుండి ఎమ్మెల్యేగా రెండుసార్లు (1989, 1994) గెలిచారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు.