blog single post
Headlines

2019-03-14 01:14:00

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 సర్వీసెస్‌ స్క్రీనింగ్ టెస్ట్‌ వాయిదా!

మే 26వతేదికి  గ్రూప్‌-1 సర్వీసెస్‌ స్క్రీనింగ్ టెస్ట్‌వాయిదా పడింది. 27/2018జారీ అయిన ఈ నోటిఫికేషన్‌లో స్క్రీనింగ్ టెస్ట్‌ మార్చి 10న నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. పరీక్షలకు సన్నద్ధం కావడానికి సమయం చాలదన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఇది వరకు ఒకసారి మార్చి 31 వరకు వాయిదా వేశారు. అయితే, గ్రూప్‌-1 సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌కు ప్రిపరేషన్‌ సమయా భావాన్ని దృష్టిలో పెట్టుకుని మరికొంత కాలం వాయిదా వేయాలని గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి కారణాలు కూడా వారు వివరించారు.దాదాపు 70% అంశాలు సివిల్స్‌ స్థాయితో ఉండడం, కొత్తగా ఎమోషనల్‌ ఇంటెలిజన్స్‌, వరల్డ్‌ జాగ్రఫీ, అర్థమెటిక్‌, పరిపాలన వంటి అంశాలను సిలబస్ లో చేర్చడం. ఆంధ్ర ప్రదేశ్ విభజన సమస్యలు, ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ వంటి అంశాలు, తెలుగు అకాడమీ పుస్తకాల ప్రచురణను ఆలస్యం చేయడం, తెలుగు మీడియం అభ్యర్థులకు పుస్తకాలు అందుబాటులో లేకపోవడంమొదలైన కారణాల నేపథ్యంలో గడువు పొడిగించాలని కోరారు. ప్రిలిమ్స్‌లోని 2వ పేపర్‌ స్కోరింగ్‌ పేపర్‌ కావడం మరియు పాలనా పరమైన కారణాల వల్ల గ్రూప్‌-1 సర్వీసెస్‌ స్క్రీనింగ్ టెస్ట్‌ను మే 26కు వాయిదా వేసినట్లు చైర్మన్‌ ఉదయభాస్కర్‌ తెలిపారు.