blog single post
Headlines

2019-03-14 11:27:40

నేడు విడుదల కానున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా

లోక్‌సభ, శాసనసభలకు తెలుగుదేశం పార్టీ నుండి  పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధిష్ఠానం ఈరోజు విడుదల చేయనుంది.120 స్థానాల పైగా శాసనసభకు,14 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది.గత కొద్ది రోజులుగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అభ్యర్థులను జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.లోక్ సభ  నియోజకవర్గాల వారీగా నేతలను,కార్యకర్తలను ఉండవల్లికి పిలిచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వేర్వేరు మార్గాల్లో అభిప్రాయాలు సేకరిస్తున్నారు.కాగా ఎన్నికల్లో ఫలితాలు సానుకూలంగా ఉన్నవారికి సర్వే పత్రాలు ఇచ్చి నియోజకవర్గంలో జాగ్రత్తగా పనిచేసుకోమని సంకేతాలిచ్చారు.అలానే 25 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు వాటి పరిధిలోని అన్ని శాసనసభ స్థానాలపై సమీక్ష పూర్తి చేశారు.కాగా విభేదాలున్న చోట అసమ్మతి నేతలను పిలిపించి అధినేత చర్చిస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజానా చౌదరి ఆధ్వర్యంలో రెండు కమిటీలు ఏర్పాటు చేశారు.కాగా సమస్యలు గుర్తించి, పరిష్కరించే బాధ్యతను వారి ఇద్దరకీ  అప్పగించారు.ఆఖరిలో వారితో అధినేత చంద్రబాబు మాట్లాడి ఒక కొలిక్కి తెస్తున్నారు.ఈరోజు ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.అయితే ఎప్పుడు ఈ సమావేశాలకు మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులను ఆహ్వానించరు.అలాంటిది ఈసారి వారికి కూడా ఆహ్వానం పంపారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వీరందరితో చర్చించిన మీదట తొలి జాబితా విడుదల చేయనున్నారు.