blog single post
Headlines

2019-03-13 04:24:28

రేపు విడుదల కానున్న టీడీపీ ఎన్నికల మేనిపెస్టో

తెలుగుదేశం పార్టీ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో రేపు విడుదల కానుంది.కాగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ ఎన్నికల మేనిఫెస్టోను రేపు విడుదల చేయనున్నారు.అయితే ఎన్నికల  మేనిఫెస్టో కు సంబంధించిన కమిటీ సమావేశం ఈరోజు జరగనుంది.ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోకు కమిటీ తుది మెరుగులు దిద్దనుందని తెలుస్తోంది.

ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగనున్న శిద్దా..!

ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయానికి తలొగ్గారు.ఒంగోలు లోక్‌సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి శిద్దా రాఘవరావు అంగీకరించారు.శిద్దా ఎంపిక అవడంతో దర్శి శాసనసభస్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డి పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది.