blog single post
Headlines

2019-03-13 01:20:18

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలువురు జాతీయ నేతలతో సమావేశం కానున్నారు.కాగా ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు లెక్కించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఈ పిటిషన్ పై 15వ తేదీన విచారణ జరగనుంది.కాగా ఈ విచారణ సందర్భంగా దేశంలోని పలువురు విపక్ష నేతలైన  రాహుల్‌గాంధీ, చంద్రబాబు, మమతాబెనర్జీ, కేజ్రీవాల్ తదితరులు కోర్టుకు హాజరుకానున్నారని తెలుస్తోంది.

కాగా ఈరోజు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు.రాజధాని అమరావతిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగనుందని సమాచారం.ఈ సందర్భంగా నంద్యాల లోక్‌సభ అభ్యర్థితోపాటు, కర్నూలు, కోడుమూరు, ఆదోని, ఆలూరు, నందికొట్కూరు శాసనసభ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుందని తెలుస్తోంది.కాగా ఈరోజు సాయంత్రానికి అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేసే అవకాశముందని పార్టీ వర్గాల నుండి సమాచారం.