blog single post
Headlines

2019-03-13 11:56:38

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ తోట నర్సింహం

తెలుగుదేశం పార్టీకి కాకినాడ లోక్ సభ సభ్యుడు తోట నర్సింహం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.తోట నర్సింహం ఈరోజు తన సతీమణి వాణితో కలిసి లోటస్‌పాండ్‌కు వెళ్లి.. వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.ఈ నేపథ్యంలో తోట నరసింహం దంపతులు మీడియాతో మాట్లాడతూ...నాకు  తెలుగుదేశం పార్టీలో చాలా అవమానం జరిగిందని తోట నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు.అలానే పెద్దాపురం వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్టు తోటవాణి మీడియాకు చెప్పారు.పెద్దాపురం శాసనసభ స్థానికి పోటీ చేయడానికి టికెట్ ఇవ్వాలని కోరినా తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.