blog single post
Headlines

2019-03-13 11:09:35

ఓటరు నమోదుకు 3రోజుల్లో ముగియనున్న గడువు!

సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. పోలింగ్‌ తేదీ సమీపిస్తోంది. ఏప్రిల్‌ 11న ప్రజాస్వామ్యానికి పరిరక్షణలాంటి విలువైన  ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ముందుగా ఓటరు జాబితాలో పేరుందో? లేదా? చూసుకోవాలి. లేకపోతే వెంటనే ఓటు నమోదు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవాలి. తుది గడువు ఈ నెల 15వ తేదీయే. ఆ తర్వాత దరఖాస్తు చేసుకుందామనుకున్నా అవకాశముండదు.ఓటరు జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 15 చివరి గడువు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6లో వివరాలను నింపి ఇటీవల తీసుకున్న 2 పాస్‌పోర్టు సైజ్‌ కలర్‌ ఫొటోలు.వయసు ధ్రువీకరణ పత్రంచిరునామా ధ్రువీకరణ పత్రం జత చేసి ఎన్నికల అధికారులకు సమర్పించాలి.