blog single post
Headlines

2019-03-12 05:03:23

టీటీడీ అక్రమాల వ్యవహారాన్ని త్వరగా నిగ్గుతేల్చాలి:బీజేపీ ఎంపీ ఎం.సుబ్రమణ్యస్వామి

తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) జరుగుతున్న అక్రమాల వ్యవహారాన్ని త్వరగా నిగ్గు  తేల్చాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఎం.సుబ్రమణ్యస్వామి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు విన్నవించారు. కాగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఎదుట సుబ్రమణ్యస్వామి హాజరయ్యారు.గతంలో ఈ వ్యవహారం పై వేసిన పిటిషన్‌కు ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం నుండి స్పందన లేదని,ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని కోర్టును ఎంపీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పందించిన హైకోర్టు ఏప్రిల్‌ 3న వాదనలు వింటామని తెలిపింది.

తరువాత ఎంపీ సుబ్రమణ్యస్వామి విలేకర్లతో మాట్లాడుతూ...తిరుమల తిరుపతి దేవస్థాన్ని ధనాన్ని, భక్తుల నుండి వచ్చే బంగారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని,రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం నుండి  టీటీడీకి విముక్తి కలిగించాలని ఎంపీ సుబ్రమణ్యస్వామి కోరారు.కాగా హిందూధర్మ మహాసభ తరహాలో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన చూడాలని,కాగా హైకోర్టు నేతృత్వంలో ఆడిట్‌ కమిటీ ఏర్పాటు చేసి దేవస్థానం జమాఖర్చులు పర్యవేక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.హిందూ ఆలయాల ధనాన్ని మసీదులు, చర్చిల నిర్వహణకు వినియోగించడం దారుణమని సుబ్రమణ్యస్వామి విమర్శించారు.