blog single post
Headlines

2019-02-11 04:13:05

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసింది:కేజ్రీవాల్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు.ఈరోజు ఢిల్లీలో చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు.ఈ  నేపథ్యంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ… అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్టని అన్నారు.కాగా తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని హామీ ఇచ్చి అమలు చేయలేదని కేజ్రీవాల్ ఆరోపించారు.ప్రధాని నరేంద్రమోదీ ఒక పార్టీకి కాదు?దేశానికి ప్రధాని అన్న విషయం మర్చిపోయారని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటానికి ఆప్ మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే హక్కుల కోసం పోరాడితే సీబీఐ,ఈడీతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.

కాగా ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాటదీక్షకు పలువురు జాతీయ నేతలు సంఘీభావం తెలిపారు.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్,జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్,ఫరూక్ అబ్దుల్లా, ఒబ్రెయిన్, తిరుచ్చి శివల తదితరులు సంఘీభావం తెలిపారు. టీడీపీ అధినేత ,ఏపీ సీఎం చంద్రబాబుకి అండగా ఉంటామని అన్నారు.