blog single post
Headlines

2019-02-11 02:38:54

నాలుగున్నరేళ్లలో 54 పరిశ్రమలు ఏపీకి వచ్చాయి:మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 100 ఆర్థిక నగరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా గత నాలుగు సంవత్సరాల కాలంలో ఏపీలో ఎఫ్‌డీఐల పెట్టుబడిలో 300 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు.నిన్న చిత్తూరు జిల్లా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ కేంద్రం-1  కార్బన్‌ సెల్‌ఫోనుల తయారీ సంస్థను ప్రారంభించడంతో పాటు ఈఎంసీ-2లో వోల్టాస్‌,డిక్సన్‌ తదితర 10 సంస్థల ఏర్పాటుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు.ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. నాలుగు ఏళ్ల కాలంలో పెద్దపెద్ద పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు.ఐటీ విభాగంలో లక్ష,ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.కాగా విశాఖను ఐటీ కేంద్రంగా ప్రపంచపటంలో నిలుపుతామని చెప్పారు.అయితే ఇప్పటికే అక్కడ అదాని సంస్థ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు.అలానే మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనుగుణంగా 30వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ప్రస్తుతం 1500 మంది మహిళలకు శిక్షణ కొనసాగుతోందని తెలిపారు.కాగా అనంతపురం జిల్లా సైతం పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారింది అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.