blog single post
Headlines

2019-02-11 01:25:06

ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో భాగం కాదా?:రాహుల్‌ గాంధీ

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ … నాటి ప్రధాని ఇచ్చిన మాటకు కట్టుబడాలని అన్నారు.ఈ ప్రధాని మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎద్దేవా చేశారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రజలకిచ్చిన హామీలను ఆయన విస్మరించారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో భాగం కాదా? అని నిలదీశాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారని విమర్శించారు. ప్రధాని ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడతారని దుయ్యబట్టారు.ఆంధ్రప్రదేశ్ కు వెళ్తే హోదా ఇవ్వకుండా అబద్ధాలు చెబుతారని ఆరోపించారు.ప్రధాని నరేంద్రమోదీకి విశ్వసనీయత లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ధ్వజమెత్తారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును దోచి అంబానీకి కట్టబెట్టారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటామని రాహుల్‌ గాంధీ మరోసారి హామీ ఇచ్చారు.