blog single post
Headlines

2019-02-11 01:12:02

హక్కుల కోసం పోరాడుతున్నాం...భిక్ష కోసం కాదు:సీఎం చంద్రబాబు

ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ భవన్‌ వేదికగా ధర్మపోరాట దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీని ఆదుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని కేంద్ర ప్రభుత్వం పై మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం కోసమే తాము పోరాడుతున్నామని,కేంద్ర ప్రభుత్వం  భిక్ష కోసం కాదని వ్యాఖ్యానించారు.మూడు రోజుల సమయం ఇస్తున్నా?పార్లమెంట్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని క్షమించరు అంటూ… ముఖ్యమంత్రి తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు.ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాడాల్సిందే అని అన్నారు.పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు మనం పోరాడాల్సిందే అని చెప్పారు.నాడు పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు పరిష్కరించలేదని తెలిపారు.దీని పై నిలదీయాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని అన్నారు.రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇంతవరకు నెరవేర్చలేదని చెప్పారు.విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నాడు భాజపా నాయకులే చెప్పారని గుర్తు చేశారు.నాడు వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని అడిగారు.అయితే ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేసింది.కాగా ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారని తెలిపారు. కాగా పోలవరం ప్రాజెక్ట్  డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించలేదని చెప్పారు.విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు పరిశ్రమ అలానే పై అతీగతీ లేదని అన్నారు.రెవెన్యూ లోటు తీర్చలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు .

ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే ఇక్కడ దీక్షకు కూర్చున్నా అని చెప్పారు. మా  పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారు.హక్కుల కోసం పోరాడుతున్నాం, మీ భిక్ష కోసం కాదు? ఇక మీ ఆటలు సాగవని చెప్పేందుకే ఇక్కడికి వచ్చాను అని అన్నారు.5 కోట్ల ప్రజల భావితరాల భవిష్యత్తు కోసం,5  కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ భవన్‌ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేశామని ,అవన్నీ కూడా విజయవంతమయ్యాయని తెలిపారు.మా ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తగిన గుణపాఠం చెప్పి తీరతాం.అద్దె జనాలను పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ పై ప్రధాని మోదీ దాడి చేశారు.కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు.కాగా లెక్కలు చెప్పడానికి మేం సిద్ధమని తెలిపారు.అయితే మేం కట్టిన పన్నులకు మీరు లెక్కలు చెప్తారా? ఇప్పటికైనా మూడు రోజుల సమయం ఉంది.చేసింది తప్పని పార్లమెంట్‌లో ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమిస్తారు.లేకుంటే శాశ్వతంగా ఈ బీజేపీని నరేంద్రమోదీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బహిష్కరిస్తారు.ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీ పార్టీ అడ్రస్‌ పూర్తిగా గల్లంతు అవుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.