blog single post
Headlines

2019-02-11 11:04:29

ఢిల్లీలో ప్రారంభమైన ధర్మాపోరాట దీక్ష

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం  చేసిన అన్యాయానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ధర్మాపోరాట దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధికి సీఎం నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.అలానే అక్కడ అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి  నివాళులర్పించారు.కాగా దీక్షకు ఏపీ నుండి పెద్ద ఎత్తున మంత్రులు,శాసనసభ్యలు,శాసనమండలి సభ్యులు తరలివచ్చారు.కాగా ఉదయం 10 గంటల నుండి వచ్చే పలు జాతీయ పార్టీల నేతల షెడ్యూల్‌ ఖరారైంది. మరికొద్దిసేపటిలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఏపీ భవన్‌కు రానున్నారు.ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ… ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.