blog single post
Headlines

2019-02-09 04:15:44

అత్యధిక స్థాయిలో 4 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేశాం:సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వాలు ఇళ్ల పేరుతో దోచుకున్నారని,నివాసయోగ్యంగా లేని ఇళ్లను నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.ఇది పేదల ప్రభుత్వం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టామని చెప్పారు.గేటెడ్‌ కమ్యూనిటీ కంటే అద్భుతంగా ఇళ్లను నిర్మించామని,నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్లను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

ఈరోజు అత్యధిక స్థాయిలో 4 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేశామని అన్నారు.ఇప్పటి వరకు 11,3,989 ఇళ్లకు గృహప్రవేశాలు చేశామని,అయితే ధనిక రాష్ట్రాల్లో కూడా ఇన్ని గృహాలు నిర్మించలేదని అన్నారు.కాగా 375 కోట్ల రూపాయలతో 1,630 కి.మీ మేర సీసీరోడ్లు వేశామని తెలిపారు.320 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించామని అన్నారు.ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద లక్షా 43 వేల మందికి లబ్ది చేకూర్చామని చెప్పారు.నెల్లూరులో పసుపు కుంకుమ క్రింద 1000 కోట్లు రూపాయలను ఇచ్చామని అన్నారు.అయితే చరిత్రలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేశామని పేర్కొన్నారు.మేము కొత్తగా 570 అంగన్‌వాడీ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.27 ఏళ్ల పాటు నా భార్య భువనేశ్వరి పరిశ్రమ నడిపారు.ఇప్పడు నా భార్య,కోడలు కలిసి పనిచేస్తున్నారు.మా సంస్థ ద్వారా అనేక ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.