blog single post
Headlines

2019-02-09 03:22:08

గవర్నర్ ను కలిసిన వైసీపీ అధినేత జగన్!

రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ఓటర్ల జాబితాపై వైసీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత జగ‌న్‌ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ను కలిసి  ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన జగన్‌.. ఈరోజు రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన వివరాలను అందజేశారు. పోలీసుల పదోన్నతుల అంశంపైనా తను ఇచ్చిన  ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ భేటీలో జగన్‌తో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఉన్నారు.