blog single post
Headlines

2019-02-09 10:50:47

ఫారెన్సిక్‌ ల్యాబ్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న గుంటూరులో ఫారెన్సిక్‌ ల్యాబ్‌ వాహనాలను జెండా ఊపీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... నేరనిర్ధారణ, విచారణకు సాంకేతిక సాయం అందించేందుకు ఫారెన్సిక్ ల్యాబ్స్ వాహనాలు మెరుగ్గా పనిచేస్తాయని చెప్పారు.డీజీపీ,పారెన్సిక్ ఎక్స్‌ఫెర్ట్ గాంధీ అందరూ కలిసి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.ప్రతి ఒక్క డీఎస్సీ సబ్ డివిజన్‌కు ఒక ఫారెన్సిక్ యూనిట్ పెట్టాలని నిర్ణయించామని అన్నారు.అయితే దీనివలన మొత్తం లైవ్‌లో చూసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పారు.