blog single post
Headlines

2019-02-08 04:33:42

ఏపీలో ప్రతి ఎకరాకు నీరందించడమే మా లక్ష్యం:సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్ట్ నిధులు సాధించేవరకు ప్రతి తెలుగువాడు పోరాడతాడని,చట్టబద్ధంగా ఆ నిధులు రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.కాగా 57,900 కోట్ల రూపాయలతో పోలవరం 2వ డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని,దాన్ని తక్షణమే ఆమోదించాలని సభాముఖంగా  డిమాండ్‌ చేస్తున్నా.కేంద్ర ప్రభుత్వం నుండి  రావాల్సిన పోలవరం ప్రాజెక్ట్ నిధులను వడ్డీతో సహా వసూలు చేస్తామని అన్నారు.ఈ అంశంలో ఎవరైనా కేంద్రానికి ఊడిగం చేస్తే వారినీ వదిలిపెట్టబోమని సీఎం తీవ్రంగా హెచ్చరించారు.పోలవరాన్ని నాటి ప్రభుత్వమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని తెలిపారు.ఇది విభజన చట్టంలో ఉందని చెప్పారు.నిధులు ఇవ్వాల్సిన బాధ్యతా కేంద్ర ప్రభుత్వం పై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ సంవత్సరం జూన్‌ నాటికి పోలవరం నుండి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని, డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.శాసనసభలో నీటిపారుదల- పోలవరం, నదుల అనుసంధానం, ప్రాజెక్టుల పురోగతి పై  చర్చ సందర్భంగా సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు.నా ఎజెండా పూర్తి కాలేదని, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఎకరాకు నీరందించడమే రానున్న 5 ఏళ్లలో లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.