blog single post
Headlines

2019-02-08 01:55:14

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ నిన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శాసనమండలి చైర్మన్‌గా షరీఫ్‌ పేరును తెలుగుదేశం,పీడీఎఫ్‌,కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ప్రతిపాదించారు.ఈ పదవికి ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనమండలి వైస్ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఇతర నేతలు ఆయన్ను అభినందించి చైర్మన్‌ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత షరీఫ్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ షరీఫ్‌ వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.

ఫరూఖ్‌ను మంత్రిగా,షరీఫ్ మండలి చైర్మన్‌గా చేయడం ద్వారా మైనారిటీలకు రెండు కీలక పదవులు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని శాసనమండలి గౌరవం నిలబెడతానని చైర్మన్‌ షరీఫ్‌ చెప్పారు.శాసనసభ సభాపతి తరహాలో కాకుండా పార్టీలకు అతీతంగా బాధ్యతలు నిర్వర్తించాలని బీజేపీ శాసనమండలి మాధవ్‌ కోరారు.