blog single post
Headlines

2019-02-08 12:58:49

లోక్‌సభలో మరోసారి విరుచుకుపడిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై నిన్న లోక్‌సభలో జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ …మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌..! మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించారు.కాగా అవిశ్వాస తీర్మాన సమయంలో నేను అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానిక్కూడా మీరు బదులివ్వలేకపోయారు.మా రాష్ట్రానికి ఇచ్చిన  హామీల గురించి చెబుతారేమోనని నిశ్శబ్దంగా వేచిచూసినా పట్టించుకోకుండా?ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంతోపాటు, రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీల అమలులో ఇంతవరకూ ఏం చేశారన్నదానిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల్లో మరోసారి మోసపోవడానికి దేశ ప్రజలెవ్వరూ సిద్ధంగా లేరని అన్నారు.కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అహంకారం.. విజ్ఞత కోల్పోయేలా చేస్తుంది. అంతిమంగా అది అభద్రతకు దారి తీస్తుంది.బీజేపీ  మొత్తం ఆ దారిలోనే ప్రయాణీస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతోపాటు,దేశం మొత్తాన్ని మోసగిస్తూ వస్తోందని అన్నారు.ఒకసారి మోసం చేస్తే అది మీకు సిగ్గుచేటు.రెండోసారి మోసపోతే మాకు సిగ్గుచేటు అవుతుంది.మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను ఈ ప్రభుత్వం మోసం చేసింది.ఎన్డీయే అధికారంలోకి వస్తే ఢిల్లీ ని మించిన రాజధాని నిర్మిస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన వాగ్దానం ప్రధానికి గుర్తులేదా? 5 కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరు,నెల్లూరు సభల్లో చెప్పిన మాట నిజం కాదా? అని గల్లా జయదేవ్ పార్లమెంట్ లో ప్రశ్నలు గుప్పించారు.

ఏపీలో బీజేపీకి ఓట్లేమీలేవు.ఆంధ్రప్రదేశ్ లో  25 లోక్ సభ స్థానాలు మొత్తం లోక్‌సభలో 5 శాతమే కదా అని మీరు అనుకొని ఉండొచ్చు? చంద్రబాబుని తక్కువ అంచనా వేసి ఉండొచ్చు? చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోవడాన్ని చూశారు.నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్డీయే-1, ఎన్డీయే-2తో సహా ఎన్నో జాతీయ రాజకీయ కూటముల ఏర్పాటులో చంద్రబాబు ముఖ్యభూమిక పోషించారు.రాజకీయాలకు అతీతంగా  చంద్రబాబుకు ఉన్న విశ్వసనీయతను మీరు తక్కువ అంచనా వేశారు.దాని ఫలితంగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలై మొత్తం ప్రతిపక్షం ఏకమైంది.మీరు భారత ప్రజాస్వామ్య శక్తినీ తక్కువగా అంచనావేశారు.దేశంలో 5% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ మీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడుతుందని మీరు అనుకొని ఉండకపోవచ్చు అని అన్నారు.