blog single post
Headlines

2019-01-11 05:22:47

పింఛన్ లబ్ధిదారులకు చంద్రన్న సంక్రాంతి కానుక

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద కానుక అందించారు.కాగా పించన్లు రూ.2వేలకు పెంచుతూ ... ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రకటన చేశారు.జనవరి నుండి పెంచిన ఈ పించన్ చెల్లిస్తారు.దీని వలన 54లక్షల మంది పించన్ దారులు  లబ్ది పొందుతారు. కాగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు కూడా ఊరటకలగనుంది. ఈ పించన్ నెలకు రూ.2వేలు చేయడం పై అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతుంది.