blog single post
Headlines

2019-01-11 01:21:19

కోడికత్తి కేసులో నిందితుడికి ఈ నెల 25వరకు రిమాండ్!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరిగిన  కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచారు.నిందితుడికి కోర్టుఈ నెల 25 వరకు రిమాండ్ విధించింది.విజయవాడ సబ్‌ జైలుకు తరలించాలని ఈ మేరకు  ఆదేశాలు జారీ చేసింది.నిందితుడు శ్రీనివాస్‌ను కస్టడీకి ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై నిందితుడి తరపు లాయర్‌ కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో సంబంధిత పిటిషన్‌ను కోర్టు పెండింగ్‌లో పెట్టింది.