blog single post
Headlines

2019-01-11 12:53:37

అతి తక్కువ కాలవ్యవధిలో ఇంత అభివృద్ధా...సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అతి తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి సాధించారంటూ…ఏపీ సీఎం  చంద్రబాబును సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రశంసించారు. కాగా ప్రభుత్వ భవన నిర్మాణ సముదాయాలను ఇరువురు పరిశీలించారు.కాగా 5 టవర్లుగా నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాల 2 పిల్లర్లకు వేసిన రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను ఈశ్వరన్‌కు సీఎం  చంద్రబాబు చూపించారు.దీనికి ముందు చంద్రబాబుతో కలిసి ఆర్టీజిఎస్ కేంద్రాన్ని ఈశ్వరన్‌ సందర్శించారు.ఆర్టీజీ పనితీరు స్ఫూర్తిదాయకంగా ఉందని ఈశ్వరన్ ప్రశంసించారు.అమరావతి పనుల వేగాన్ని చూసి సింగపూర్ ఈశ్వరన్‌ ఆశ్చర్యపోయారని,ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయని అనుకోలేదని అన్నారు.

మరో వైపు భారత్‌లోని ప్రతిభకు సింగపూర్‌ సామర్థ్యం తోడైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ అన్నారు.ఆంధ్రప్రదేశ్  నైపుణ్యాభివృద్ధి సంస్థ, సింగపూర్‌కు చెందిన సింక్రో స్కిల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో పెళ్లి కుమార్తెల అలంకరణ, ఫొటో గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు విజయవాడలో నిర్వహించిన పట్టభద్రుల వేడుకలో ఈశ్వరన్ మాట్లాడారు.కాగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినుల ఫ్యాషన్‌ షో, వస్త్రాలంకరణ ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.