blog single post
Headlines

2019-01-11 11:44:15

ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటా:సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని అంకుర ప్రాంత అభివృద్ధి ప్రదేశంలో అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) చేపట్టే ‘వెల్‌కమ్‌ గ్యాలరీ’ నిర్మాణానికి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.కాగా నాటి ఆలోచనలన్నీ ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయని,రాజధాని అమరావతి ఒక రూపు సంతరించుకుంటోందని ముఖ్యమంత్రి చెప్పారు.అమరావతిలో రూ.40వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెల్‌కమ్‌ గ్యాలరీ రాజధానికి ముఖద్వారంగా ఉంటుంది.కాగా అత్యుత్తమ ఆచరణలు,అత్యాధునిక సాంకేతికతలను ఈ గ్యాలరీలో ప్రవేశపెట్టొచ్చు అని తెలిపారు.అయితే సాంకేతికతను వినియోగించి పారదర్శక పరిపాలనను అందించడంలో ఏపీ ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది.దీనితో  అతి త్వరలో ప్రపంచానికే ఆదర్శమవుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.కాగా అదానీ గ్రూపుతో కలిసి ప్రపంచంలోనే అద్భుతమైన డేటా కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం అని ముఖ్యమంత్రి చెప్పారు.ఆంధ్రప్రదేశ్ సులభతర వాణిజ్యంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు.ఇక్కడి ప్రజలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలను కల్పిస్తున్నాం అని సీఎం అన్నారు. అయితే ప్రతి కుటుంబానికి త్వరలో స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వనున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

పలు సంస్థలతో ఒప్పందాలు

అంకుర ప్రాంత అభివృద్ధిలో భాగంగా అమరావతి అభివృద్ధి భాగస్వామి కొన్ని సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంది.అయితే జర్మనీ, జపాన్‌, సింగపూర్‌తో పాటు భారత్‌కు చెందిన 15 సంస్థలతో ఈ ఒప్పందాలు చేసుకున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.