Headlines

2019-01-10 04:49:49

అమరావతిలో ‘వెల్‌కమ్ గ్యాలరీ’కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది:సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ‘వెల్‌కమ్ గ్యాలరీ’కు ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.కాగా స్టార్టప్ ఏరియా ఫేస్-1 దగ్గర ‘వెల్ కమ్ గ్యాలరీ’ ని సింగపూర్ మంత్రి ఈశ్వరన్,ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.ఈ నేపథ్యంలోనే సీఎం మాట్లాడుతూ…రాజధాని అమరావతి అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వ సహకారం మరువలేనిదని ప్రశంసించారు. కాగా సింగపూర్ తరహాలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానన్న మాటను నిలబెట్టుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.అయితే స్కిల్ డెవలప్ మెంట్, పరిపాలనా వ్యవహారాల్లో సింగపూర్ సహకారం అందిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన,నైపుణ్యంలో సింగపూర్ సహకరిస్తోందని,అమరావతిలో నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని సీఎం తెలుపారు.కాగా రాజధాని అమరావతికి నిర్మాణానికి 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు ధన్యవాదాలు తెలిపారు.