blog single post
Headlines

2019-01-10 03:51:34

త్వరలో అమరావతి మెట్రో సవివరణ నివేదిక

నవ్యంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నివేదిక  మరో నెల రోజుల్లో సిద్ధం అవ్వనుంది.రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే మధ్యంతర డీపీఆర్‌ ఇచ్చినా   సర్కార్‌ ఆలోచనలు, అధికారులు సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో మొత్తం 73 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో మెట్రో  ప్రాజెక్టు రానుంది. ప్రాజెక్టును రెండు దఫాల్లో నిర్మించాలని భావిస్తునట్లు తెలుస్తుంది. మొదటి దశలో విజయవాడ నగరంలో, ఆ తర్వాత రాజధాని ప్రాంతానికి అనుసంధానించేలా  ప్రణాళిక సిద్ధమవుతుందని అమరావతి మెట్రో రైల్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.