blog single post
Headlines

2019-01-10 02:23:36

సింగపూర్ సహకారంతో అమరావతిలో గ్యాలరీ నిర్మాణం:సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గ్యాలరీ నిర్మాణం సింగపూర్‌ సహకారంతో ప్రారంభించామని సీఎం చంద్రబాబు చెప్పారు.కాగా స్టార్టప్ ఏరియా ఫేస్1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి  మీడియాతో మాట్లాడుతూ … స్కిల్‌ డెవలెప్‌మెంట్‌, పరిపాలన వ్యవహారాల్లో సింగపూర్‌ సహకారం అందిస్తోందని తెలిపారు.అయితే మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, నైపుణ్యంలో సింగపూర్‌ సహకరిస్తోందని, అమరావతిలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.కాగా ఈ-ప్రగతి, రియల్‌ టైం గవర్నెన్స్‌(ఆర్టీజిఎస్) అమలు ద్వారా మంచి పరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.ఆర్టీజిఎస్ ద్వారా కోటిన్నర ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించినట్లు సీఎం చెప్పారు.అయితే బిగ్‌ డేటా సెంటర్‌ను ఏపీలో అదాని గ్రూప్‌ ఏర్పాటు చేస్తోందని అన్నారు. కాగా అందుబాటులో విస్తారమైన వనరులు, నీటి లభ్యత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.రాజధాని అమరావతిలో పరిపాలన భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ట్రంక్ ఇన్ఫ్రా అందుబాటులోకి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి నిర్మాణం ఒక అద్భుతమైన అవకాశమని ముఖ్యమంత్రి అన్నారు.అయితే ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ సాయం చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.