blog single post
Headlines

2019-01-10 01:23:07

వర్జీనియాకు ధీటుగా విశాఖను మారుస్తా:సీఎం చంద్రబాబు

నిన్న ఒక్కరోజే ఏపీలో లక్షకోట్ల రూపాయిల పెట్టుబడులతో ఒప్పందాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.కాగా గత 9 రోజులగా జరుగుతున్న 6వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం పై  ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.కాగా గ్రామసభలను విజయవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.ఆంధ్రప్రదేశ్ లో లక్షా 26వేల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రానున్నాయని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చెప్పారు.ఏపీ పర్యాటక రాజధాని విశాఖలో డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కులు వస్తున్నాయి అని సీఎం చంద్రబాబు చెప్పారు.అయితే  వర్జీనియాకు దీటుగా విశాఖ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.ఈ పెట్టుబడుల భాగంగా ప్రకాశం జిల్లాలో వివిధ సంస్థలు రూ.24,500కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని సీఎం తెలిపారు.అయితే ఆసియా పల్ప్ అండ్ పేపర్ మిల్లు వస్తోందని,దీని వలన ప్రత్యక్షంగా 4,500మందికి, పరోక్షంగా మరో 12వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి అని చెప్పారు.ప్రకాశం జిల్లాలోని 50వేల మంది రైతులకు దీనివలన ప్రయోజనం కలగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు, భావనపాడు పోర్టులు రానున్నాయని..లాజిస్టిక్స్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారనుందని సీఎం అన్నారు.అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమలో పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని, వెనుకబడిన జిల్లాలలో సంపద సృష్టిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, వీటన్నింటినీ ప్రజలకు మీరు వివరించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు,రెవిన్యూ అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.