blog single post
Headlines

2019-01-10 11:41:33

ఏపీ అభివృద్ధిలో ఐటీ రంగం ముఖ్యపాత్ర పోషిస్తోంది:సీఎం చంద్రబాబు

ప్రఖ్యాతి అదానీ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది.కాగా రాజధాని అమరావతిలో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు,ఏపీ ఐటిశాఖ  మంత్రి లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.అయితే మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నాయని,నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయి అని ముఖ్యమంత్రి చెప్పారు.రాబోయే 20 ఏళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనకు వీలుగా రూ.70వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో ఒక గిగా వాట్‌ డేటా సెంటర్‌ ను మూడు కేంద్రాలుగా ఏర్పాటు చేస్తుంది. అయితే ఏపీ అభివృద్ధిలో ఐటీ రంగం ముఖ్య పాత్రను  పోషిస్తోందని, భవిష్యత్ తరం అభివృద్ధిలో డేటా రంగానిదే కీలకపాత్ర అని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డేటా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.కాగా డేటా రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు .

దేశంలో డేటా కేంద్రాలు రెండు చోట్లే మాత్రమే ఉన్నాయి ... 
ప్రస్తుతం మనదేశంలో డేటా సెంటర్లు చెన్నై, ముంబయి వంటి మహానగరాల్లో మాత్రమే ఉన్నాయి. కాగా 2016 నాటికి దేశంలో డేటా సెంటర్ల రంగం అభివృద్ధి విలువ దాదాపుగా 160 బిలియన్‌ డాలర్లు కాగా, ఇది ప్రపంచంతో పోలిస్తే రెండు శాతం మాత్రమే ఉంది.ఈ రంగంలో ప్రతి ఏడాది 20శాతం పెరుగుదల చోటుచేసుకుంటోందని  గణాంకాలు చూస్తే  తెలుస్తుంది.అయితే డేటా సెంటర్ల ఏర్పాటుతో దీని పై ఆధారపడిన అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల వృద్ధి రేటు పెరుగుతుంది.