blog single post
Headlines

2019-01-09 11:03:02

జాతీయ నేతలతో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు

ఒక రోజు పర్యటన కోసం నిన్న దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు జాతీయ స్థాయి  నేతలతో సమావేశమయ్యారు. మొదట కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తరువాత ఏపీ భవన్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి భోజనం చేశారు. వెంటనే శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లి ఆయనతోపాటు జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాలతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు.