blog single post
Headlines

2019-01-09 10:37:13

నేటితో పూర్తికానున్న ప్రతిపక్షనేత జగన్ పాదయాత్ర..!

వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఈరోజుతో పూర్తికానుంది.శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో  మధ్యాహ్నం 1.15 గంటలకు జాతీయ రహదారిని ఆనుకుని బహుదా నదికి సమీపంలో నిర్మించిన పాదయాత్ర పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. అక్కడే 341 రోజులుగా 3,656 కిలోమీటర్ల మేర సాగిన తన యాత్రను ఆయన ముగిస్తారు.అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.2017 నవంబరు 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. 13 జిల్లాల్లో 134 నియోజకవర్గాల మీదుగా 231 మండలాలు, 2516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, ఎనిమిది కార్పొరేషన్ల మీదుగా ఈ యాత్ర సాగింది. ఈ క్రమంలో 124 సభలు, సమావేశాలు, 55 ఆత్మీయ సమావేశాల్లో జగన్‌ పాల్గొన్నారు. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. రాయలసీమలోని కడప జిల్లాలో ప్రారంభమయిన ఆయన యాత్ర, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా శ్రీకాకుళం చేరుకొంది.