blog single post
Headlines

2019-01-08 03:33:43

కర్నూలు జిల్లాను ప్రగతిపథం వైపు నడిపిస్తాను:సీఎం చంద్రబాబు

కర్నూలు జిల్లాలో 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కర్నూల్  జిల్లాను అన్ని ప్రగతిపథంలో నడిపించనున్నట్లు ప్రకటించారు.కాగా అమరావతిలో హైకోర్టు ఏర్పాటు కానున్నడంతో కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.కాగా కర్నూల్‌ ఎయిర్‌ పోర్టు నుండి అమరావతి, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు నడిచేలా చూస్తానని సీఎం చెప్పారు.అయితే కర్నూల్‌ జిల్లాలో 97 ఎత్తిపోతల పథకాలు ఇప్పటికే పూర్తి చేశామని,వీటి  ద్వారా కర్నూలు జిల్లాలోనీటిని అందిస్తాం అని చెప్పారు.

ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తామన్నారు. అయితే ఓర్వకల్లు పారిశ్రామిక వాడగా మారుతుంది అని చెప్పారు.అయితే దాదాపు 200 నూతన కంపెనీలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు.ఇక్కడి  ఆల్ట్రా మెగాపవర్‌ సోలార్‌ పార్క్‌ ప్రపంచంలోనే 3వ అతి పెద్ద పార్క్‌ అని సీఎం చెప్పారు. ప్రతి నియోజక వర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.