blog single post
Headlines

2019-01-08 01:32:59

విభజన హామీల అమలు పై నివేదిక విడుదల చేసిన జెపి కమిటీ

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలు తూతూమంత్రంగా జరిగిందని,అయితే చాలా నిధులు పై ఏపీకి రావలసి ఉందని నిపుణుల కమిటీ వివరించింది.కాగా విభజన హామీలు అనుకున్న విధంగా అమలు జరిగితే పోలవరం ప్రాజెక్టు నిధులు మినహా ఇంకా రాష్ట్రానికి రూ.75 వేల కోట్లు రావలసి ఉంటుందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. కాగా లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్  నారాయణ నేతృత్వం వహించిన ఈ కమిటీ రాష్ట్ర విభజన తరువాత హామీలు అమలు జరిగిన తీరు,కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల విడుదలైన నిధులు వినియోగం తదితర అంశాల పై నివేదికను ఈ కమిటీ విడుదల చేసింది.అయితే ఈ కమిటీలోని సభ్యులు జయ ప్రకాష్ నారాయణ,జస్టిస్‌ పర్వతరావు, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య,మాజీ సీఎస్‌ అజేయ కల్లం,ప్రొఫెసర్‌ గలాబ్‌,ప్రొఫెసర్‌ రాధాకృష్ణ నిన్న విజయవాడలో పలు అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

జెపి నివేదికలోని పలు కీలకాంశాలు:

  • రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాలి.  
  • కేంద్రం అనుసరిస్తున్న పన్నుల పంపకం సరిగాలేదు.

  • కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర బకాయిలను రద్దు చేయాలి.    

  • రాష్ట్ర విభజన తరువాత తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది.  
  • హామీలు అమలు విషయాన్ని రాజకీయ కోణంలో ఈ అంశాన్ని చూడకూడదు.   

  • అమరావతికి రూ.1500 కోట్లు కేంద్రం విడుదల చేసింది.కాగా ఇంకా రోడ్లు, వరదనీటి లైన్లు, పారిశుద్ధ్య లైన్లు, తాగునీటి అవసరాల కోసమైనా కేంద్రం నిధులివ్వాల్సిన అవసరం ఉంది.

  • జాతీయ సంస్థలకు 6శాతమే నిధులు విడుదల చేశారు.ఇంకా 93 శాతానికి పైగా నిధులు రావాలి.