blog single post
Headlines

2019-01-08 12:43:02

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు

కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి లోకేష్‌ పర్యటిస్తున్నారు.కాగా ఈ సందర్భంగా కర్నూలు లోని  ఓర్వకల్లు సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, సోలార్‌ పార్క్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు జాతికి అంకింతం చేశారు. అనంతరం కర్నూలులో స్టేట్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు, ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.అనంతరం పాణ్యం మండలం బ్రాహ్మణపల్లి, జూపాడుబంగ్లా మండలం తంగడంచ, బనగానపల్లె పరిధిలో ఎం.ఎస్.ఎంఈ పార్కుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.కాగా ఎయిర్‌పోర్టులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.