blog single post
Headlines

2019-01-08 12:29:11

13న కీలక ప్రకటన చేయనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 13న గుంటూరు జిల్లాలో  తెనాలి నగరానికి రానున్నట్లు ఆ పార్టీ నాయకుడు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.ఈ సంక్రాంతిని పురస్కరించుకుని పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగే భోగి పండుగ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని మనోహర్వివరించారు.కాగా దీనికి సంబంధించి పెదరావూరు వ్యవసాయ క్షేత్రంలో చేయనున్న ఏర్పాట్లను నిన్న కార్యకర్తలతో కలిసి నాదెండ్ల  పరిశీలించారు.అయితే రైతులు, మహిళలు యువతతో పవన్‌ కళ్యాణ్ భేటి అవుతారని రైతాంగ సమస్యల పై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేయనున్నారని మనోహర్‌ చెప్పారు.కాగా మనోహర్ వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.